
- లాంచ్ చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ:రైల్వే డిజిటల్ సేవలు మరింత మెరుగుపర్చేందుకు ఇండియన్ రైల్వే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే చోట అందించేలా ‘రైల్ వన్’ పేరుతో దీనిని రూపొందించారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్, ఫ్లాట్‌ఫామ్ టెకెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్, జర్నీ ప్లానింగ్, ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్స్ వంటి సర్వీసులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 40వ యానివర్సరీ సందర్భంగా కేంద్రమంత్రి లాంచ్ చేశారు. ఐఓఎస్, యాండ్రాయిడ్ మొబైల్ యూజర్లు రైల్ వన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేస్కోవచ్చు.