SwaRail App: అన్ని రైల్వే సేవలు ఒకచోట..రైల్వే కొత్తయాప్ ‘స్వారైల్’

SwaRail App: అన్ని రైల్వే సేవలు ఒకచోట..రైల్వే కొత్తయాప్ ‘స్వారైల్’

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఒకే యాప్లో రైల్వే టికెట్ల బుకింగ్, స్టేటస్, రైల్ ట్రాకింగ్, అలాగే రైలు ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారం బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు..ప్లాట్ ఫాంపై మీ బోగీ పొజిషన్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఏదైన సమస్య ఉంటే రైల్వే శాఖకు ఈ యాప్ నుంచి కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైలు ప్రయాణం మరింత స్మార్ట్ గా, సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ఆ యాప్..స్వారైల్(SwaRail) యాప్.. 

స్వారైల్ యాప్ ను 2025లో ఇండియన్ రైల్వే శాఖ ప్రారంభించింది. మొదట సెలెక్ట్ చేయబడిన ఆండ్రాయిడ్, iOS కస్టమర్లకు స్వారైల్ బీటీ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు అందరికి అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా ప్రయాణికుల సేవలను మరింత మెరుగుపర్చడంకోసం ఈ స్పెషల్ యాప్ ను రూపొందించారు. రైల్వే లో అన్ని రకాల పబ్లిక్ సర్వీస్ లను ఫ్రెండ్లీ ప్లాట్ ఫాం ద్వారా అందించించేందుకు ఈ యాప్ ను తయారు చేశారు. 

గతంలోఈ సేవలు IRCTC రైల్ కనెక్ట్, UTS మొదలైన వివిధ యాప్‌లలో అందుబాటులో ఉండేవి. ఎంచుకున్న ఆండ్రాయిడ్ ,iOS కస్టమర్లకు కొంతకాలం పాటు స్వారైల్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అయితే, గూగుల్ ప్లే స్టోర్లలో యాప్ కోసం ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ప్రస్తుతం నిండిపోయింది. ఇప్పడు కొత్త కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. 

స్వారైల్ యాప్ గురించి 10 కీలక విషయాలు.. 

  • ఇది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని CRIS(సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) ద్వారా స్వారైల్ యాప్ అభివృద్ది చేశారు. 
  • అన్ని రైళ్ల ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంటే అధికారిక ప్లాట్ ఫాం. 
  • SwaRail యాప్ ద్వారా Trains List బ్రౌజ్ చేయొచ్చు. రిజర్వ్ డ్, అన్ రిజర్వ్ డ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 
  • "My Booking"  విభాగంలో మీ గత ప్రయాణాలను ట్రాక్ చేయవచ్చు.
  • ప్రయాణీకులు వారి రైల్ కనెక్ట్ లేదా IRCTC ఆధారాలతో సైన్ ఇన్ చేయవచ్చు లేదా కొత్తదాన్ని సృష్టించవచ్చు.
  • ఈ యాప్ ద్వారా మీ రైలుట్రాక్ చేయొచ్చు. ఆలస్యం అయితే సమాచారం తెలుసుకోవచ్చు. ట్రైన్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు లైవ్ అందిస్తుంది. 
  • ప్లాట్ఫాంపై మీ కోచ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకునేందుకు SwaRail యాప్ సాయపడుతుంది. 
  • రైలు ప్రయాణంలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. 
  • ఈ యాప్‌లో ప్లాన్ షిప్‌మెంట్, ట్రాక్ షిప్‌మెంట్, టెర్మినల్ ఫైండర్ మొదలైన సరుకు రవాణా సాధనాలు ఉన్నాయి.
  • ఏదైనా సమస్యలు ఉంటే కంప్లైంట్స్ చేయొచ్చు.. ట్రాక్ చేయొచ్చు. దీనికోసం రైల్ మదద్ ఫీచర్ ఉంటుంది. 
  • ఇక పేమెంట్స్ కోసం ఈ యాప్ లో RWallet అని డిజిటల్ వాలెట్ ఉంటుంది. 
  • టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సలేషన్ వంటి వాటికి ఈ RWallet ద్వారా లావాదేవీలు జరపొచ్చు. 
  • ఈ యాప్ అన్ని భాషల్లో ఉంటుంది. 

రైలు ప్రయాణాన్ని మరింత స్మార్ట్ గా సౌకర్యవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు SwaRail యాప్ ఎంతో సాయపడుతుంది.గతంలో బీటా వెర్షన్ గా కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది.  ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్, iOS స్మార్ట్ ఫోన్లకు అందుబాటులోకి వస్తుంది. 

ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్