రికార్డ్ స్థాయిలో స్పెషల్ ట్రైన్స్: వినాయక చవితి వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

రికార్డ్ స్థాయిలో స్పెషల్ ట్రైన్స్: వినాయక చవితి వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: వినాయకచవితి వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్‌లో ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. వినాయకచవితిని పురస్కరించుకుని రికార్డ్ స్థాయిలో 380 స్పెషల్ ట్రైన్లు నడిపనున్నట్లు వెల్లడించింది. ఫెస్టివల్ సీజన్లో సాధారణ ప్రయాణీకులు, భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యవంతగా ప్రయాణించడం కోసం అదనపు రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. అదనపు రైళ్లు ఎక్కువగా సెంట్రల్ రైల్వే నడపనుంది. 

మహారాష్ట్ర, కొంకణ్ బెల్ట్‌లో అధిక ప్రయాణీకుల డిమాండ్‌కు అనుగుణంగా సెంట్రల్ రైల్వే నుంచి 296 స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. మహారాష్ట్రలో వినాకయక చవితి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయనున్న నేపథ్యంలో సెంట్రల్ రైల్వే నుంచి భారీ మొత్తంలో అదనపు రైళ్లను కేటాయించారు.  పశ్చిమ రైల్వే 56, కొంకణ్ రైల్వే 6, నైరుతి రైల్వే 22 అదనపు రైళ్లను నడపించనున్నాయి. 2024లో వినాయక చవితి సందర్భంగా 358 ప్రత్యేక రైళ్లను నడిపిస్తే.. ఈ సారి 380 ట్రైన్లను నడిపిస్తోంది రైల్వే శాఖ.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 27 నుంచి వినాయక చవితి వేడుకలు మొదలు కానున్నాయి. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని 2025, ఆగస్ట్ 11 నుంచే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపుతోంది రైల్వే శాఖ. పండుగ తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ అదనపు రైళ్ల సంఖ్య క్రమంగా పెంచుతోంది. స్పెషల్ ట్రైన్ల షెడ్యూల్‌, సమయం, హాల్ట్‌లు IRCTC అధికారిక వెబ్‌సైట్, రైల్‌వన్ యాప్, కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని ప్రయాణికులకు సూచించింది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులు వీటి ద్వారా అదనపు రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.