
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో ఇండియా యంగ్ షూటర్ల గురి అదిరింది. గురువారం జరిగిన విమెన్స్50 మీటర్ల రైఫిల్ ప్రోన్లో ఇండియాకు చెందిన ముగ్గురు షూటర్లు క్లీన్ స్వీప్ చేశారు. ఆసియా చాంప్ అనుష్క థోకూర్ (621.6), అన్షిక (619.2), ఆద్యా అగర్వాల్ (615.9) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.
మెన్స్50 మీటర్ల రైఫిల్ ప్రోన్లో దీపేంద్ర సింగ్ షెకావత్(617.9), రోహిత్ కన్యన్ (616.3) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. వీళ్లకు తొలి ఇంటర్నేషనల్ మెడల్స్ కావడం విశేషం. కమిల్ నురియా ఖ్మెటోవ్ (618.9) స్వర్ణం సాధించాడు.