
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 14–21, 11–21తో పోర్న్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో, మల్విక బన్సోద్ 12–21, 16–21తో రట్చనోక్ ఇంతనాన్ (థాయ్‌లాండ్) చేతిలో, ఆకర్షి కశ్యప్ 9–21, 14–21తో సుపనిదా కటెతోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతిన్నారు.
మెన్స్ సింగిల్స్‌లో తరుణ్ మానేపల్లి 14–21, 16–21తో అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. విమెన్స్ డబుల్స్‌లో ట్రిసా–గాయత్రి గోపీచంద్ 20–22, 14–21తో రుయ్ హిరోకమి–సయకా హోబరా (జపాన్) చేతిలో ఓడారు.