చంద్రయాన్-­3కి ఇస్రో రెడీ

చంద్రయాన్-­3కి ఇస్రో రెడీ
  • స్పేస్ క్రాఫ్ట్​ను రాకెట్​తో అనుసంధానించిన సైంటిస్టులు
  • 13న లాంచింగ్​కు ఏర్పాట్లు

బెంగళూరు: ఇండియన్  స్పేస్  రీసెర్చ్  ఆర్గనైజేషన్  (ఇస్రో) చంద్రయాన్–3కి సిద్ధం అవుతున్నది. బుధవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్  స్పేస్  సెంటర్ లో చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్  ఉన్న ఎన్ క్యాప్సులేటెడ్  అసెంబ్లీని లాంచ్  వెహికల్  మార్క్ 3 (వీఎల్ఎం3) తో ఇస్రో సైంటిస్టులు అనుసంధానించారు. వీఎల్ఎం 3తో చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్​ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు బెంగళూరులోని నేషనల్  ఏజెన్సీ ట్వీట్  చేసింది. చంద్రయాన్–2కు ఫాలో ఆన్  మిషనే చంద్రయాన్–3. ఈ నెల 13 నుంచి 19 మధ్య చంద్రయాన్–3 మిషన్​ను లాంచ్  చేస్తామని ఇస్రో తెలిపింది. అయితే, 13 నాడే లాంచ్  చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ ఇస్రో అధికారి వెల్లడించారు. చంద్రుడి ఉపరితలం, చంద్రుడిలో సంభవించే కంపనాలు, చంద్రుడి ఉపరితల ప్లాస్మా ఎన్విరాన్ మెంట్  వంటి అంశాలపై పరిశోధన చేసేందుకు వివిధ సైంటిఫిక్ ఇన్​స్ట్రుమెంట్లను చంద్రయాన్–3 తీసుకెళ్లనుంది.

చంద్రయాన్ 3లో మూడు రకాల మాడ్యూల్స్

ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్  అనే 3 రకాల మాడ్యూల్స్  చంద్రయాన్ 3లో ఉన్నాయి. చంద్రుడి కక్ష్యలోని వంద కిలోమీటర్ల వరకు ల్యాండర్, రోవర్ ను ప్రొపల్షన్  మాడ్యూల్  తీసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలంపై టెంపరేచర్, థర్మల్  కండక్టివిటీని మెజర్  చేయడానికి ల్యాండర్  పేలోడ్ లో థర్మోఫిజికల్  ఎక్స్ పెరిమెంట్  వంటి పేలోడ్లను అమర్చారు. అలాగే ప్లాస్మా సాంద్రత, దాని రకాలను అధ్యయనం చేయడానికి ల్యాంగ్ మిర్  ప్రోబ్  ఇన్ స్ట్రుమెంట్ ను కూడా ల్యాండర్ లో ఫిక్స్  చేశారు. ఇక రోవర్  పేలోడ్ లో ‘ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్’, ‘లేజర్  ఇన్ డ్యుస్డ్  బ్రేక్ డౌన్  స్పెక్ట్రోస్కోపీ’ అనే పరికరాలు ఏర్పాటు చేశారు. చంద్రయాన్ 3 ల్యాండ్  అయ్యే ప్రాంతంలో ఎలిమెంటల్  కంపోజిషన్ ను తెలుసుకోవడానికి ఆ పరికరాలు సాయపడతాయి. రోవర్  చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ రసాయనాల విశ్లేషణను చేపడుతుంది.