భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్లుగా హైదరాబాదీలు

భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్లుగా హైదరాబాదీలు

అంతర్జాతీయ స్పీడ్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ ప్లేయర్లు ముగ్గురికి చోటు దక్కింది. బోరబండ బాలుర గురుకుల స్కూల్ కు చెందిన రఘు, మెషక్‌, కరుణాకర్‌ ఆయా విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్‌-14 జట్టుకు ఎంపికైన రఘు…కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. భారత్‌ అండర్‌-19 బాలుర జట్టుకు మెషక్‌, అండర్‌-17 బాలుర జట్టులో కరుణాకర్‌ చోటు దక్కించుకున్నారు. నేపాల్‌లోని మహేందర్‌నగర్‌లో ఈనెల 25, 26 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ముగ్గురు ప్లేయర్లు జాతీయ జట్టుకు ఎంపికవడంపై సంతోషంగా ఉందన్నారు ఆ స్కూలు PET నాసన్‌.