మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. సెమీస్లో అతను ఓడిపోయాడు. హోరా హోరీగా సాగిన మెన్స్ సింగిల్స్ సెమీస్ లో ప్రణయ్..హాంకాంగ్ ప్లేయర్ ఎన్జీ క లాంగ్21-17,9-21,17-21 స్కోరు తేడాతో ఓటమిపాలయ్యాడు.
గతంలో లాంగ్ తో ఎనిమిది మ్యాచుల్లో తలపడ్డ ప్రణయ్..నాలుగు మ్యాచుల్లో గెలిచాడు. ఈ నేపథ్యంలో కాన్ఫిడెంట్తో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన ప్రణయ్..అద్భుతమైన షాట్లతో ఫస్ట్ గేమ్లో 21-17తో గెలిచాడు. అయితే రెండో గేమ్లో లాండ్ పుంజుకున్నాడు. ప్రణయ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తూ..9-21తో రెండో గేమ్ను గెలిచి మ్యాచ్ను సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో లాంగ్ తన జోరును కొనసాగించాడు. లాంగ్ స్మాష్లకు ప్రణయ్ సమాధానం చెప్పలేకపోయాడు. సుధీర్ఘర్యాలీలతో ప్రణయ్ అలసిపోయాడు. దీంతో ఫైనల్ గేమ్ను 21 -17తో గెలిచ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. సెమీస్లో ఓడిన ప్రణయ్‌కు రూ. 4 లక్షల 13 వేల ప్రైజ్‌మనీ లభించింది.
