
న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ఇండియన్ ప్యాసెంజర్ మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతనిపై విమానయాన సంస్థ నిషేధం విధించింది. నిందితుడిని 21 ఏళ్ల ఆర్య వోహ్రా యుఎస్ యూనివర్శిటీ విద్యార్థిగా అధికారులు గుర్తించారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకని బాధిత వ్యక్తి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు.
కానీ ఘటనపై ఆగ్రహించిన ఫ్లైట్ సిబ్బంది.. ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో దిగగానే వోహ్రా ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు ఆర్యా వోహ్రాపై నిషేధం విధించినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. మద్యం మత్తులో వోహ్రా సిబ్బంది సూచనలను పాటించకపోగా.. సిబ్బందితో వాగ్వాదానికి దిగాడని పేర్కొంది. మరోవైపు వోహ్రాపై చర్యలు తీసుకుంటామని కూడా ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ భారత పౌర విమానయాన శాఖ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ను కోరింది.