ఉక్రెయిన్‌లో మరో విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో మరో విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల చందన్ జిందాల్... అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడులతో కొందరు భారత విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా  మారింది. ఈ   క్రమలోనే పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన చందన్‌ జిందాల్ (21) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అతనికి రక్తం గడ్డ కట్టడంతో  వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

చందన్ విన్నిట్సియాలో నేషనల్‌ పైరోగవ్‌ మెమోరియల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు.ఫిబ్రవరి 2న అనారోగ్యానికి గురవ్వడంతో అతనికి శస్త్ర చికిత్స చేశారు. ఫిబ్రవరి 7న అతని తండ్రి శిషన్ కుమార్, మామ కృష్ణకుమార్ అతనితో కలిసి ఉక్రెయిన్ వెళ్లారు. చందన్ మంగళవారం మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. నిన్న రష్యా చేసిన బాంబు దాడుల్లో కర్నాటకకు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

విద్యార్థుల్ని ముందుగానే ఎందుకు తీసుకురాలే?