టీటీకి అర్చన గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

టీటీకి అర్చన గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై
  • ఉన్నత చదువుల కోసం అమెరికాకు 
  • భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎకానమిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్థిరపడాలని నిర్ణయం

న్యూఢిల్లీ : ఇండియా టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్చన కామత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నట్లు తెలిపింది. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎకానమిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దేశానికి సేవలందిస్తానని వెల్లడించింది. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగించుకుని వచ్చిన తర్వాత తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్షుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సుదీర్ఘంగా చర్చించిన 24 ఏళ్ల అర్చన రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపే మొగ్గు చూపింది. ఆర్థిక భారంతో లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఆటలో కొనసాగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదని ఆమె స్పష్టం చేసింది. 

‘నాకు టీటీతో పాటు చదువంటే కూడా చాలా ఇష్టం. కానీ టీటీలో కొనసాగితే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే వచ్చే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు నేను ఆటలో కొనసాగడం కూడా కష్టంగా మారింది. అందుకే ఆటకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెబుతున్నా. నేను చదవాలనుకున్న కోర్సు గురించి గతేడాదే మిచిగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ఎంక్వయిరీ  చేశా. అయితే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలిసారి అర్హత సాధించడంతో దేశానికి ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ముగిశాయి. కాబట్టి ఇక చదువుపై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి భిన్నమైన రీతిలో సేవలందిస్తా. ఆర్థికవేత్తగా నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలని అనుకుంటున్నా’ అని ఆర్చన పేర్కొంది. 

ఇండియాకు ఆడటం గౌరవం..

ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా భావిస్తున్నానని అర్చన తెలిపింది. ‘ఆటలో ఉన్నప్పుడు నాకు అన్ని రకాల మద్దతు లభించింది. కాకపోతే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయా. అది ఒక్కటే కాస్త బాధ కలిగిస్తోంది. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇప్పుడు దాన్ని మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతా. అయినా యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీటీ ఆడేందుకు ప్రయత్నిస్తా. సీనియర్లు శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనిక బాత్రాతో కలిసి ఆడటం మంచి జ్ఞాపకాలను మిగిల్చింది’ అని అర్చన వివరించింది. 

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేసినప్పుడు విమర్శలు రావడం కూడా ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం పడింది. అయితే మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా తొలిసారి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరడంలో అర్చన కీలక పాత్ర పోషించింది. కానీ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1–3తో జర్మనీ చేతిలో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క అర్చనానే గెలవడం విశేషం. 

చదువులో టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

టీనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టీటీలోకి వచ్చిన అర్చన చిన్నప్పట్నించి చదువులోనూ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. 10, 12వ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 98.7, 97 శాతం మార్కులు సాధించింది. ఎకనామిక్స్​తో బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీని పూర్తి చేసింది. ఇక ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసిన అర్చన.. ప్రస్తుతం మిచిగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండోసారి మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీని చదువుతోంది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్యాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావించే ఆమె ఆ స్థాయిలో ఎకానమిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్థిరపడాలని భావిస్తోంది.