అతడు అద్భుతాలు చేయగలడు

V6 Velugu Posted on Apr 21, 2021

చెన్నై: ముంబైతో బుధవారం జరిగిన టఫ్ ఫైట్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కొట్టింది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబైని తక్కవ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ధవన్, లలిత్ యాదవ్ రాణించడంతో విజయం సాధించింది. ముఖ్యంగా యువ ఆటగాడు లలిత్ యాదవ్ (25) కీలక టైమ్‌‌లో క్రీజులో నిలిచి ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌‌లోనూ ఒక వికెట్‌‌తో యాదవ్ రాణించాడు. ఈ నేపథ్యంలో లలిత్ యాదవ్‌‌పై ఢిల్లీ సారథి పంత్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతాలు చేయగలడని కొనియాడాడు. 

‘లలిత్ యాదవ్ మంచి ట్యాటెంట్ ఉన్న ఆటగాడు. అతడికి ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి వికెట్లపై అతడు అద్భుతాలు చేయగలడు. స్పిన్ వేయడంతోపాటు బ్యాటింగ్‌‌లోనూ లలిత్‌‌ రాణిస్తుండటం శుభపరిణామం. అతడి ఆల్‌రౌండ్ స్కిల్స్ మాకు బాగా పనికొస్తాయ్. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే.. అమిత్ మిశ్రా వల్లే మేం గేమ్‌‌లోకి వచ్చాం. అతడు వికెట్లు తీయడంతో మాకు మూమెంటమ్ దొరికింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టంగా సాగింది’ అని పంత్ పేర్కొన్నాడు.  

Tagged batting, ipl 2021, Rishabh Pant, Amit Mishra, Lalit Yadav, Mumbai Indians

Latest Videos

Subscribe Now

More News