పాస్ పోర్టులు లాక్కుని.. నిర్బంధించారు ..రష్యాలో ఇండియన్ టూరిస్టులకు చేదు అనుభవం

పాస్ పోర్టులు లాక్కుని.. నిర్బంధించారు ..రష్యాలో ఇండియన్ టూరిస్టులకు చేదు అనుభవం

మాస్కో: రష్యాకు వెళ్లిన 12 మంది ఇండియన్ల బృందానికి చేదు అనుభవం ఎదురైంది.  ముగ్గురిని మాత్రమే తమ దేశంలోకి అనుమతించిన రష్యా ఇమిగ్రేషన్ అధికారులు..మిగిలిన 9 మందిని క్రిమినల్స్ లా నిర్బంధించారు. బాధితుల్లో  అమిత్ తన్వర్  అనే వ్యక్తి  ఇన్‌‌‌‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. 

జులై 8న ఉదయం  మాస్కో ఎయిర్  పోర్టులో దిగామని, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా.. ఎలాంటి కారణం చెప్పకుండా తనిఖీల పేరుతో పాస్ పోర్టులు లాక్కుని మూడు రోజులు  నిర్బంధించారని అమిత్ తెలిపాడు. తిండి, నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదని వాపోయాడు. కాగా, వీరంతా గురువారం ముంబైకి తిరిగి వచ్చారు.