
భారతీయులు ఎంతైనా తెలివైనోళ్లు బ్రో. ఎంత తక్కువకు ఏదైనా వస్తువును కొనొచ్చు అనే బేరసారాలు చేయటం సహజమే. అయితే ఇంకొద్దిగా ముందుకెళ్లి తెలివిగా స్మార్ట్ ప్లానింగ్ చేసి ఖరీదైన వస్తువులను కూడా తక్కువ రేట్లకు ఎలా కొనొచ్చనే విషయాన్ని ఒక భారతీయ ట్రావెలర్ తన రెడిట్ పోస్టులో పంచుకోవటం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
@Shuict అనే యూజర్ పేరు కలిగిన వ్యక్తి ఆపిల్ మ్యాక్ బుక్ తన 11 రోజుల వియత్నాం హాలిడేలో ఎలా తక్కువ రేటుకు కొనుగోలు చేశాడనే విషయాన్ని పంచుకున్నారు. దీంతో ఒకేసారి వెకేషన్ ఎంజాయ్ చేయటంతో పాటు తనకు కావల్సిన వస్తువును తెలివిగా తక్కువ రేటుకే తెచ్చుకోగలిగాడు. తాను వియత్నాంలోని హనోయికి వెళ్లి అక్కడ రిమోట్ వర్క్ చేసుకుంటూనే నగరాన్ని అన్వేషించినట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి వియత్నాంలో ఆపిల్ ఉత్పత్తులు తక్కువ రేటు ఉండటంతో పాటు టూరిస్టులకు వ్యాట్ పన్ను రిఫండ్ ఆఫర్ చేస్తోంది. అయితే కొనే ముందు షాపు యజమానిని వ్యాట్ రిఫండ్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తారా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలని సూచించారు. భారతదేశంలో మ్యాక్ బుక్ ఖరీదు రూ.లక్ష 85వేలుగా ఉంది. కానీ దానిని వియత్నాంలో రూ.లక్ష 48వేలకు కొన్నాడు సదరు ట్రావెలర్. దీంతో అతనికి నేరుగా రూ.36వేల 500 తగ్గింపు లభించింది.
►ALSO READ | Gold Rate: రాఖీ రోజు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. లేటొద్దు షాపింగ్ చేస్కోండి..
తాను వియత్నాం ట్రిప్ కోసం మెుత్తంగా అంటే మ్యాక్ బూక్, విమాన ఖర్చులు, హోటల్ స్టే, ఫుడ్, యాక్టివిటీస్ కోసం రూ.2లక్షల 80వేల వరకు ఖర్చయిందని చెప్పాడు యూజర్. అయితే తనకు అక్కడి ప్రభుత్వం నుంచి వ్యాట్ రిఫండ్ వచ్చిన తర్వాత ఇది మెుత్తంగా రూ.లక్ష 97వేలకు తగ్గినట్లు చెప్పాడు. ఇందులో తన మ్యాక్ బుక్ ఖర్చు తీసేస్తే కేవలం రూ.48వేలకే వియత్నాం ట్రిప్ పూర్తి చేసుకోగలిగినట్లు వెల్లడించాడు. ఇదంతా చదివిన వాళ్లు నువ్వు గ్రేట్ బాసు అంటున్నారు నెట్టింట. ఎంజాయ్ చేస్తూనే తక్కువ రేటుకు మ్యాక్ బుక్ దక్కించుకోవటానికి అతను ఫాలో అయిన టెక్నిక్ అదుర్స్ అంటూ క్రేజీ కామెంట్స్ పెండుతున్నారు.