హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది. రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన ఈ అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురాబోతున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యాట సత్యనారాయణ, సీనియర్ యాక్టర్ ప్రభాకర్, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కౌశిక్, అవార్డ్స్ ఛైర్ పర్సన్ సుధా హెరమత్, నిర్వాహకులు మధు తదితరులు పాల్గొన్నారు.
