పాక్ స్వాతంత్ర్య సంబురాల్లో భారత్ నుంచి వెళ్లిన అంజూ

పాక్ స్వాతంత్ర్య సంబురాల్లో భారత్ నుంచి వెళ్లిన అంజూ

తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందుగా, ప్రతి సంవత్సరం ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కాగా అంజు ప్రస్తుతం సెలబ్రేట్ చేసుకున్న ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంచి. ఈ వీడియోలో, పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె నస్రుల్లాతో కలిసి కేక్ కటింగ్ లో పాల్గొంటూ కనిపించింది.

పెళ్లయి పిల్లలున్న అంజు.. పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో, అంజు దాదాపు రెండేళ్లపాటు భారతదేశంలో వీసా కోసం ప్రయత్నించినట్లు నివేదికలు తెలిపాయి. వీసా దొరక్క అంజు ఇటీవలే పాకిస్థాన్ వెళ్లింది. ఆమె పాకిస్తాన్‌లో ఇస్లాం మతంలోకి మారిందని, నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఆమె విడుదల చేసిన ఒక వీడియోలో.. ఈ వాదనలను ఖండించింది. తాను మళ్లీ భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు అందులో తెలిపింది.

నస్రుల్లాను కలవడానికి అంజు పాకిస్థాన్ వెళ్లిందన్న విషయం తెలియగానే ఇండియాలో ఉన్న అంజు భర్త షాక్ అయ్యాడు. తాను జైపూర్‌ వెళుతున్నానని, మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తానని అంజు తనతో చెప్పిందని అతను చెప్పాడు. అయితే అంజు పాకిస్థాన్‌కు వెళ్లిందనే వార్తలు వైరల్ కావడం.. పోలీసులు అక్కడికి రావడంతో అతను షాక్‌కు గురయ్యాడు.