ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరింది. డూ ఆర్ డై మ్యాచులో భారత మహిళల జట్టు అదరగొట్టింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
సెంచరీ మిస్..
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. స్మృతి మంధాన 56 బంతుల్లో 87 పరుగులు సాధించింది. షఫాలీ వర్మ 29 బంతుల్లో 24 చేసింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ 12 బంతుల్లో 19 పరుగులు చేయడంతో టీమిండియా 150 మార్కును క్రాస్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ 3 వికెట్లు తీసింది. ప్రెండర్ గ్యాస్ట్ 2 వికెట్లు పడగొట్టింది.
వర్షంతో అంతరాయం..
156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఐర్లాండ్.. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత వాన తగ్గకపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతను నిర్ణయించారు. మ్యాచ్ నిలిచే టైంకు భారత్ 5 పరుగులతో ఐర్లాండ్ కంటే ముందుంజలో ఉంది. దీంతో టీమిండియా విజయం సాధించి సెమీస్లో అడుగు పెట్టింది.
