కొలంబో: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ టీమ్.. తొలి అంధుల (బ్లైండ్) టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఆదివారం కొలంబోలోని పి. సర్వణముత్తు స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 114/5 స్కోరు చేసింది. సరితా గిమ్రి (38 బాల్స్‌లో 35) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఇండియన్ బౌలర్లు ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క బౌండ్రీ ఇచ్చారు.
ఛేజింగ్‌లో ఇండియా 12.1 ఓవర్లలో 117/3 స్కోరు చేసి నెగ్గింది. పహులా సారెన్ (27 బాల్స్ లో 4 ఫోర్లతో 44) దుమ్మురేపింది. ఈ టోర్నీలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఇండియా గెలవడం మరో విశేషం. లీగ్ దశలో శ్రీలంక, ఆస్ట్రేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌ను ఓడించిన ఇండియా.. సెమీస్‌లో 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. మరో సెమీస్‌లో పాక్‌ను ఓడించిన నేపాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్లైండ్ క్రికెట్ రూల్స్ ప్రకారం ఈ టోర్నీని నిర్వహించారు.
