ఇస్తాంబుల్: ఇండియా రెజ్లర్లు సుజీత్ కల్కల్, జైదీప్ అహ్లావత్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. వరల్డ్ క్వాలిఫయర్స్‌లోభాగంగా ఆదివారం జరిగిన మెన్స్ ఫ్రీ స్టయిల్ 65 కేజీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో సుజీత్ 2–2 తేడాతో అమెరికా రెజ్లర్ జియాన్ అలెన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ బౌట్‌లో సుజీత్‌ను టేక్‌డౌన్ చేసిన జియాన్ గెలిచాడు. 74 కేజీ బ్రాండ్ మెడల్ బౌట్‌లో జైదీప్ 1–2తో డెమిర్టాస్ (టర్కీ) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు.
