ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్నఇండియన్లు

ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్నఇండియన్లు

ఆస్ట్రేలియాలో ఇండియన్ల జనాభా పెరుగుతోంది. ఆ దేశ పౌరసత్వం తీసుకుంటున్న ఇతర దేశాల ప్రజల్లో ఇండియన్లే ముందున్నారు. ఈ లిస్టులో గత రెండేళ్లగా మనోళ్లే టాప్‌‌లో ఉన్నారని ఆస్ట్రేలియా డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హోం ఆఫైర్స్‌‌ వెల్లడించింది. 2018–19లో 200 దేశాలకు చెందిన 1.27 లక్షల మందికి పౌరసత్వమిస్తే అందులో 22.3 శాతం (28,470 మంది) ఇండియన్లేనని తెలిపింది. 2017–18లో 80,649 మందికి ఇస్తే అప్పుడూ 17,756 మందితో ఇండియన్లే టాప్‌‌లో ఉన్నారని చెప్పింది. మొత్తంగా 2017–18తో పోలిస్తే 2018–19లో ఆస్ట్రేలియా సిటిజన్‌‌షిప్‌‌ తీసుకున్న వాళ్ల సంఖ్య 60 శాతం పెరిగిందని వివరించింది. డిసెంట్‌‌ (సంతతి), కాన్ఫెరల్‌‌తో సిటిజన్‌‌షిప్‌‌ను ఎక్కువగా పొందుతున్నారని చెప్పింది. కాన్ఫెరల్‌‌లో సిటిజన్‌‌షిప్‌‌కు సంబంధించి పరీక్ష ఉంటుందని, ఆస్ట్రేలియా గురించి, ఇంగ్లీష్‌‌పై టెస్టు ఉంటుందని పేర్కొంది.

వలస పోతున్న ఇండియన్లూ ఎక్కువే

ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్న ఇండియన్ల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది మిగతా దేశాల జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువని చెప్పింది. 2017–18లో 33,310 మంది (స్టూడెంట్లు కాకుండా) ఇండియన్లు ఆస్ట్రేలియా వలస వెళ్లారని, ఆ ఏడాది ఆ దేశానికి వలస వెళ్లిన వాళ్లలో ఇది 20.5 శాతమని పేర్కొంది.  ఆస్ట్రేలియాలో సిటిజన్‌‌షిప్‌‌ అప్లికేషన్ల ప్రాసెసింగ్‌‌ టైం పెరిగిందని, ఏడేళ్ల కిందట 167 రోజులు పడితే ఇప్పుడు 493 రోజుల కన్నా ఎక్కువ పడుతోందని అక్కడి మీడియా పేర్కొంది. ఇప్పటివరకు 2.21 లక్షల మంది అక్కడి సిటిజన్‌‌షిప్‌‌ కోసం వెయిట్‌‌ చేస్తున్నారంది. వీళ్లలో 30 వేల మంది మనోళ్లే ఉన్నారని పేర్కొంది. అలాగే ఆస్ట్రేలియా  సిటిజన్‌‌షిప్‌‌ తీసుకుంటున్న వాళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోందని, 2017=18తో పోలిస్తే 2018–19లో ఈ సంఖ్య 58 శాతం పెరిగిందని చెప్పింది.

ఆస్ట్రేలియా కొత్త రీజినల్‌‌ వీసా పాలసీ

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్మనెంట్‌‌ రెసిడెన్స్‌‌ పొందాలంటే ఏదాది పాటు అక్కడ నివసించి ఉండాలి. అయితే ఏడాది టైంను నాలుగేళ్లకు పొడిగించాలని, ఇంగ్లీష్‌‌ పరీక్ష లెవెల్‌‌ను పెంచాలని 2017లో బిల్లు తీసుకొచ్చారు. కానీ అది పార్లమెంటు ఆమోదం పొందలేదు. పర్మనెంట్‌‌ రెసిడెన్స్‌‌ (పీఆర్​) పొందితే ఎంతకాలమైనా ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో పర్మనెంట్‌‌ రెసిడెన్స్‌‌ అమెరికా గ్రీన్‌‌కార్డుతో సమానం. పర్మనెంట్‌‌ రెసిడెన్స్‌‌ వచ్చాక అక్కడి సిటిజన్‌‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా కొత్తగా రీజనల్‌‌ వీసా రిజైమ్​ను తీసుకొస్తోంది. నవంబర్‌‌ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సిడ్నీ, మెల్‌‌బోర్న్‌‌, బ్రిస్బేన్‌‌ లాంటి మెట్రోపాలిటన్‌‌ సిటీలు మినహా మిగిలిన ప్రాంతాన్ని రీజినల్‌‌గా పిలుస్తున్నారు. ఈ ఉన్నోళ్లు మూడేళ్లు ఆస్ట్రేలియాలో ఉంటే పీఆర్​ కోసం  అప్లై చేసుకోవచ్చు.