మెక్సికోలో విమాన ప్రమాదం.. ఇండస్ట్రీ గోడౌన్ పైకప్పును ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. ఏడుగురు సజీవదహనం

మెక్సికోలో విమాన ప్రమాదం.. ఇండస్ట్రీ గోడౌన్ పైకప్పును  ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. ఏడుగురు సజీవదహనం

మెక్సికోలో భారీ విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం(డిసెంబర్16) శాన్ మాటియో అటెన్ కోలో అత్యవసర ల్యాండింగ్ అవుతున్న ప్రైవేట్ జెట్ విమానం గోడౌన్ మెటల్ పైకప్పును ఢీకొట్టింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం  10మంది ఉన్నారు.  

అకాపుల్కో నుంచి  మెక్సికోలోని టోలుకా ఎయిర్ పోర్టు కు  ప్రైవేట్ జెట్ ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో విమానం సాకర్ మైదానంలో దిగడానికి ప్రయత్నించే క్రమంలో సమీపంలోని బిజినెస్ సంస్థ మెటల్ పైకప్పును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. మంటల్లో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. భవనంలోని 130 మందిని రక్షించినట్లు స్థానిక మీడియా తెలిపింది.