
వాషింగ్టన్: వచ్చే నవంబరులో జరిగే అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటీవ్స్ ఎలక్షన్స్‌లో అర డజనుకు పైగా ఇండియన్ అమెరికన్స్ పోటీలో ఉండబోతున్నారు. వీరిలో అమెరికా కాంగ్రెస్ సభ్యులు అమీ బేరా, రో ఖన్నాతోపాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. కాలిఫోర్నియాలో ఉండే బెరా, ఖన్నాలు ప్రైమరీస్‌లో 7వ, 17వ కాంగ్రెషనల్ జిల్లాల్లో ఈజీగా గెలిచారు. వీరిద్దరూ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. మరో ఇండియన్ అమెరికన్ మాంగా అనంతములా వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్ జిల్లాలో రిపబ్లికన్ ప్రైమరీలో విన్ అయ్యారు. ఆమె ఆరు సార్లు డెమో క్రాటిక్ పార్టీ నుంచి గెలిచారు.