
ప్రధాని మోడీ పిలుపుతో ఆదావారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లు ఆపేసిన భారతీయులు.. 9 నిమిషాల పాటు క్యాండిళ్లు, దీపాలను, టార్చ్ లైట్స్ వెలిగించారు. పలుచోట్లు మొబైల్ ప్లాష్ లైట్లను ఆన్ చేయగా.. యావత్ దేశం దీపకాంతులతో వెలిగిపోయింది. కరోనా చీకట్లను తరిమేందుకు దీప ప్రజ్వలన కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునివ్వగా .. గో కరోనా గో అంటూ కొందరు ప్రజలు నినాదాలు చేశారు.