‘సంద్రం’ సంగతి తేలుద్దాం.. రీసెర్చ్​ కోసం అంటార్కిటికాకు ఇండియన్లు

‘సంద్రం’ సంగతి తేలుద్దాం.. రీసెర్చ్​ కోసం అంటార్కిటికాకు ఇండియన్లు

    క్లైమేట్​చేంజ్​పై రీసెర్చ్​ కోసం అంటార్కిటికాకు ఇండియన్లు

    సముద్రజలాలు, గాలి, కాలుష్యాలపైనా అధ్యయనం 

   ఫ్యూచర్​లో కచ్చితమైన వాతావరణ అంచనాకు చాన్స్

 

వాతావరణ మార్పు ఎఫెక్ట్ అడవులు, నేలపై మాత్రమే కాదు.. సముద్రాలపైనా ఎక్కువే ఉంటుంది. సముద్ర జలాలు, గాలులు, అక్కడి రసాయనాల వంటివి వాతావరణంలో మార్పులను మనకు పట్టి చూపిస్తాయి. అందుకే.. హిందూ మహాసముద్రంతో పాటు అంటార్కిటిక్ ఓషియన్ పై కీలక రీసెర్చ్ కోసం ఇండియన్ రీసెర్చర్ల టీం రెండు నెలల యాత్రకు శ్రీకారం చుట్టింది. సౌతాఫ్రికాకు చెందిన ఎస్.ఎ. అగాలస్ రీసెర్చ్ షిప్ పై మారిషస్ నుంచి ఈ టీం తమ యాత్రను ప్రారంభించింది.

16 ప్రాజెక్టులపై రీసెర్చ్..

అంటార్కిటికా సముద్రంపై ఇండియా మొదటిసారి 2004 జనవరి నుంచి మార్చి వరకు పైలట్ ఎక్స్ పెడిషన్ ద్వారా రీసెర్చ్ చేసింది. తర్వాత 2006లో మరో స్పెషల్ యాత్ర జరిగింది. ఆ రెండు రీసెర్చ్‌‌‌‌ లలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకే ఈసారి 18 మందితో రెండు నెలల పాటు భారీ రీసెర్చ్ కు కేంద్రం ప్లాన్ చేసింది. ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్ పెడిషన్ టు ది సదర్న్ ఓషియన్ (ఐఎస్ఈఎస్ఓ) 2020 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో సుమారుగా16 ప్రాజెక్టులపై రీసెర్చ్ జరగనుంది.

60 ప్రాంతాల్లో డేటా సేకరణ..

పూణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం)కు చెందిన అనూప్ మహాజన్ ఆధ్వర్యంలోని ఈ టీంలో గోవాలోని ఎన్సీపీఓఆర్, బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్ యూ, అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ, చెన్నైలోని ఎన్ఐఓటీ సంస్థలకు చెందిన మొత్తం 18 మంది రీసెర్చర్లు యాత్రకు బయలుదేరారు. అంటార్కిటికాలో  మూడో ఇండియన్ స్థావరం అయిన ‘భారతి’ ప్రాంతం గుండా ఈ రీసెర్చ్ టీం ప్రయాణించనుంది. యాత్ర మొత్తంలో 60 ప్రాంతాల్లో సముద్ర జలాలు, సముద్ర గాలులపై రీసెర్చ్ చేసి, అన్ని రకాల డేటాను కలెక్ట్ చేయనుంది.

రీసెర్చ్ చేసే అంశాలు ఇవే..

ఎయిర్ – సీ– ఐస్ మధ్య ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి?

ప్రాంతీయ, ప్రపంచ వాతావరణ వ్యత్యాసాల్లో అట్లాంటిక్ సముద్రం పాత్ర ఎంత?

అట్లాంటిక్ ఓషియన్ లో అట్మాస్పెరిక్, ఫిజికల్, కెమికల్, జియోలజికల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

సముద్ర జలాల్లో మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలుగుతున్న ఎఫెక్ట్స్ ఏమిటి?

సముద్రంలో సెఫలోపాడ్స్ (తలకు కాళ్లుండే ఆక్టోపస్ వంటి జీవులు), మెరైన్ బ్యాక్టీరియా పరిస్థితి ఎలా ఉంది?

ఓసియన్ లో కార్బన్ స్టోరేజ్ ఏ మేరకు ఉంది?

సముద్ర జలాల్లో టెంపరేచర్లు ఎలా మారుతున్నాయి?

సముద్రపు గాలిలో ఏరోసాల్స్ వంటి పొల్యూటెంట్ల ఎఫెక్ట్ ఎలా ఉంది?

ఈ రీసెర్చ్ లతో మనకేంటి లాభం?

క్లైమేట్ చేంజ్ పరిణామాలను మరింత బాగా అంచనా వేయవచ్చు.

వాతావరణ మార్పులను ముందే పసిగట్టేందుకు చాన్స్ ఉంటుంది.

క్లైమేట్ చేంజ్ వల్ల మన రుతుపవనాలపై పడే ప్రభావాన్ని తెలుసుకోవచ్చు.

ఫ్యూచర్ లో వాతావరణ పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించవచ్చు.