అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ లో రాజాచారికి కీలక పదవి

అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ లో రాజాచారికి కీలక పదవి

వాషింగ్టన్: అమెరికా వైమానిక దళం(ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్) లోని అత్యున్నత పదవుల్లో ఒకటైన బ్రిగేడియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవికి తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్  రాజా జె చారి(45) ని యూఎస్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గా ఆ దేశ ప్రెసిడెంట్ బైడెన్ నామినేట్ చేశారు. వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ ఈ మేరకు గురువారం ప్రకటన చేయగా.. రాజా జె చారి  నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది.

ఆయన ప్రస్తుతం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఆస్ట్రోనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, క్రూ–3 కమాండర్ పనిచేస్తున్నట్లు తెలిపింది. రాజా జె చారి తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజా జె చారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాచుసెట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ (ఎంఐటీ)లో  ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 2020లో  క్రూ-3 మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపిక అయ్యారు. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,500 గంటలకు పైగా విమానయానం చేసిన అనుభవం ఆయనకు ఉంది. వచ్చే ఏడాది చంద్రుడిపైకి అమెరికా పంపబోయే వ్యోగగాముల టీమ్​లోనూ రాజా జె చారి ఉన్నారు.