రిలే జట్లకు మళ్లీ నిరాశే..

రిలే జట్లకు మళ్లీ నిరాశే..

గ్వాంగ్జౌ (చైనా): ఇండియా మెన్స్‌‌‌‌ 4X400, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ 4X400 రిలే జట్లు.. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు అర్హత సాధించడంలో మళ్లీ నిరాశపర్చాయి. ఆదివారం వచ్చిన ఆఖరి అవకాశాన్నీ వృథా చేసుకున్నాయి. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ హీట్‌‌‌‌–2లో బరిలోకి దిగిన ఇండియా బృందం (సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌, రూపల్‌‌‌‌ చౌదరి, తెన్నరసు విశాల్‌‌‌‌, సుభ వెంకటేశ్‌‌‌‌) 3ని.14.81 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. టాప్‌‌‌‌–3లో నిలిచిన జట్లు మాత్రమే వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు క్వాలిఫై అవుతాయి. 

ఇక మెన్స్‌‌‌‌ 4X400 హీట్స్‌‌‌‌లో జై కుమార్‌‌‌‌, ధరమ్‌‌‌‌వీర్‌‌‌‌ చౌదరి, సాజి మను, రిన్సీ జోసెఫ్‌‌‌‌తో కూడిన ఇండియా జట్టు 3ని.04. 49 సెకన్లతో ఏడో ప్లేస్‌‌‌‌తో సంతృప్తి పడింది. 

శనివారం జరిగిన రెగ్యులర్‌‌‌‌ హీట్స్‌‌‌‌లోనూ మెన్స్‌‌‌‌, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ జట్లు ఐదో ప్లేస్‌‌‌‌లో నిలిచి నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌‌‌‌గా రెండు కేటగిరీల్లో టాప్‌‌‌‌–14లో నిలిచిన జట్లు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు అర్హత సాధించాయి. 25 ఫిబ్రవరి 2024 నుంచి 24 ఆగస్టు 2025 క్వాలిఫికేషన్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లో ఇతర జట్ల పెర్ఫామెన్స్‌‌‌‌ బట్టి మిగతా రెండు జట్లను ఎంపిక చేస్తారు.