
లండన్: ప్రముఖ కన్నడ రచయిత్రి, యాక్టివిస్ట్, అడ్వకేట్ బాను ముస్తాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్-–2025 వరించింది. ‘హార్ట్ ల్యాంప్’ అనే చిన్న స్టోరీ కలెక్షన్‌కు గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను చరిత్ర సృష్టించారు. లండన్‌లోని టాటా మోడ్రన్ లో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బాను ముస్తాక్ ఈ అవార్డుతో పాటు రూ.57 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ ను కన్నడ నుంచి ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన దీపా బస్తీ కూడా బాను వెంట ఉన్నారు. బాను కథలు.. సౌత్ ఇండియాలోని ముస్లిం మహిళల జీవితాలు, వారి పోరాటాలను వివరిస్తాయి. బుకర్ ప్రైజ్ ఈవెంట్‌లో బాను ముస్తాక్ మాట్లాడారు.
‘‘నేను రాసిన కథల్లో మహిళల గురించి, వారిపై జరిగే క్రూరత్వం గురించి వివరించాను. సౌత్ ఇండియా ముస్లిం మహిళల జీవన విధానం, పోరాటాల గురించి తెలియజేశాను. ‘హార్ట్ ల్యాంప్’ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. ఏ కథ కూడా చిన్నది కాదనే నమ్మకం నుంచి ‘హార్ట్ ల్యాంప్’ పుట్టింది. మనిషి జీవితంలో ప్రతి అనుబంధం ఎంతో విలువైంది. ప్రపంచం మనల్ని విభజించే ప్రయత్నం చేస్తుంటుంది.
సాహిత్యం అనేది.. మనం ఒకరి మనస్సులో ఒకరు జీవించగలిగే పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది’’ అని బాను అన్నారు. తాను ట్రాన్స్‌లేట్ చేసిన హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్-–2025కు ఎంపికవ్వడం సంతోషంగా ఉందని దీప్తి అన్నారు. కాగా, ముస్లిం కుటుంబంలో పుట్టిన బాను.. స్కూల్లో చదువుకుంటున్న టైమ్‌లోనే తొలిసారి ఒక షార్ట్ స్టోరీ రాశారు. 26 ఏండ్ల వయసులో ఆమె కథ పేపర్లో పబ్లిష్ అయింది.