
గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో స్టార్టప్ ల సంఖ్య కొన్ని వందల నుంచి 70,000 దాకా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దాదాపు 60 విభిన్న పరిశ్రమలలో స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిలో 5000కు పైగా స్టార్టప్ లు బయోటెక్ రంగంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. ‘బయోటెక్ స్టార్టప్ ఎక్స్ పో’ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రధాని మోడీ గురువారం ఉదయం ప్రారంభించారు.
Addressing the Biotech Startup Expo 2022. It will strengthen the Aatmanirbhar Bharat movement in the sector. https://t.co/GN0sv2PdRP
— Narendra Modi (@narendramodi) June 9, 2022
భారత దేశ బయో ఎకానమీ గత ఎనిమిదేళ్లలో 8 రెట్ల వృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు. బయోటెక్ గ్లోబల్ ఎకో సిస్టమ్ విభాగంలోని పది అగ్రగామి దేశాల జాబితాలో భారత్ చేరే సమయం ఎంతోదూరంలో లేదన్నారు. బయోటెక్ రంగంలో కొంగొత్త అవకాశాలకు స్వర్గధామంగా భారత్ వెలుగొందుతోందని మోడీ కొనియాడారు. కాగా, ఎక్స్ పోలో అధునాతన బయోటెక్ అప్లికేషన్లకు సంబంధించిన 300 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.