భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి

భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి

జెనీవా: భారత్‌లో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు, ఆస్పత్రుల్లో వేలాది మంది పేషెంట్లు, రోజురోజుకీ ఎక్కువవుతున్న మృతుల సంఖ్య.. ఇవన్నీ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయన్నారు. అందుకే భారత్‌కు సాయంగా వేలాది ఆక్సిజన్ కాన్సేంట్రేటర్లను పంపినట్లు ఆయన తెలిపారు. వేగంగా తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం కోసం టెంట్లను, మాస్కులు, మెడికల్ ఎక్విప్‌మెంట్లను  కూడా పంపామన్నారు. ఈ సమయంలో ఇండియాకు సాయాన్ని అందిస్తూ బాసటగా నిలుస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కరోనా తొలి ఏడాది కంటే సెకండ్ ఇయర్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని టెడ్రోస్ హెచ్చించారు.