ఆరేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయిన గోధుమల స్టాక్

ఆరేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయిన గోధుమల స్టాక్
  • ఆరేళ్ల కనిష్టానికి పతనం
  • ధరల్లోనూ విపరీతంగా పెరుగుదల
  • డిమాండ్​ పెరగడమే కారణం

న్యూఢిల్లీ: గోధుమల స్టాక్ ఆరేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయింది.  డిమాండ్ పెరగడం, నిల్వలు పడిపోవడంతో ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.  ప్రభుత్వం దగ్గరున్న మొత్తం గోధుమ నిల్వలు ఈ నెల ప్రారంభంలో 19 మిలియన్ టన్నులు కాగా,  2021 డిసెంబరులో వీటి పరిమాణం 37.85 మిలియన్ టన్నుల వరకు ఉండేది. గోధుమ ఉత్పత్తి కరువులు, వర్షాభావం కారణంగా 2014–- 2015లో  పడిపోయింది. ఇన్వెంటరీలు 16.5 మిలియన్ టన్నులకు తగ్గిపోయాయి. 2016 నుండి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. “కొత్త పంట సరఫరా నాలుగు నెలల తర్వాత మాత్రమే వస్తుంది.  

రైతుల నుంచి సరఫరా దాదాపు ఆగిపోయింది  వ్యాపారులు నెమ్మదిగా స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విడుదల చేస్తున్నారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా ఎక్కువ నిల్వలు అవసరం" అని ముంబైకి చెందిన గ్లోబల్ ట్రేడ్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు అన్నారు.  కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం, జాతీయస్థాయిలో నెలవారీ సగటు హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ ధరలు జనవరిలో క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2,228, ఫిబ్రవరిలో రూ.2,230, మార్చిలో రూ.2,339, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2,384, మేలో రూ.2,352, జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2,316, జూలైలో రూ.2,409, ఆగస్టులో రూ.2,486, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2,516, అక్టోబర్​లో రూ.2,571, నవంబరులో క్వింటాలుకు రూ.2,721 చొప్పున ధర ఉంది.   ధరలను నియంత్రించేందుకు ఈ ఏడాది మే నెలలో  ఎగుమతులపై నిషేధం విధించారు.  ఈ  రబీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోధుమ విస్తీర్ణం 25 శాతం పెరిగి 255.76 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా.