భారత్ పై పాక్ ప్రధాని ప్రశంసలు

భారత్ పై  పాక్ ప్రధాని ప్రశంసలు

పాకిస్థాన్: పాకిస్థాన్ కంటే భారత విదేశాంగ విధానం భేష్ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసలు కురిపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్లు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. విదేశాంగ విధానంలో ఇమ్రాన్ ఖాన్ ఫెయిలయ్యారని ఆ దేశ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తన హయాంలో పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ కారణాలతో ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో ఓ ర్యాలీకి హాజరైన ఇమ్రాన్ మాట్లాడుతూ... భారత్ ఎల్లప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉందన్నారు. భారత్ కు వారి ప్రజల శ్రేయస్సే ముఖ్యమన్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయని, కానీ భారత దేశం మాత్రం ఆ దేశం నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటోందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తో పాటు భారత్ క్వాడ్ లో సభ్య దేశంగా ఉందన్నారు. ఆ మూడు దేశాలు రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్ కు మద్ధతుగా వ్యవహరిస్తుంటే.. భారత దేశం మాత్రం తటస్థంగా ఉందన్నారు. 

ఇవి కూడా చదవండి...

ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా కుప్పకూలిన గ్యాలరీ