పెరిగిన ఫారెక్స్ నిల్వలు

పెరిగిన ఫారెక్స్ నిల్వలు

ముంబై:  మనదేశ ఫారెక్స్ నిల్వలు జనవరి 12తో ముగిసిన వారానికి 1.634 బిలియన్ డాలర్లు పెరిగి 618.937 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. మునుపటి రిపోర్టింగ్ వారంలో, మొత్తం నిల్వలు  5.89 బిలియన్ డాలర్ల నుంచి  617.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021 అక్టోబర్​లో దేశం  ఫారెక్స్ విలువ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం నుంచి ప్రపంచ పరిణామాల కారణంగా ఏర్పడిన ఒత్తిళ్ల మధ్య రూపాయిని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ ఫారెక్స్​ను అమ్మడంతో నిల్వలు దెబ్బతిన్నాయి.

ఈ నెల 12తో ముగిసిన వారానికి, విదేశీ కరెన్సీ ఆస్తులు -- నిల్వలలో ప్రధాన భాగం - 1.859 బిలియన్ డాలర్లు పెరిగి 548.508 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు 242 మిలియన్ డాలర్లు తగ్గి 47.247 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌‌బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్  12 మిలియన్ డాలర్లు పెరిగి  18.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిపోర్టింగ్ వారంలో ఐఎంఎఫ్​లో భారతదేశం  రిజర్వ్ స్థానం 6 మిలియన్ డాలర్లు పెరిగి  4.872 బిలియన్ డాలర్లకు చేరుకుంది.