V6 News

ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7.2 శాతం.. అంచనాలు పెంచిన ఏడీబీ

ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7.2 శాతం.. అంచనాలు పెంచిన ఏడీబీ

న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందుతుందని ఆసియన్ డెవలప్‌‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. గతంలో వేసిన అంచనా 6.5 శాతం నుంచి పెంచింది. కేంద్రం జీఎస్‌‌టీ, ఇన్‌‌కమ్ ట్యాక్స్ తగ్గించడంతో వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఆసియా ఆర్థిక వ్యవస్థ 5.1శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది.