కొద్దిగా పెరిగిన ఎగుమతులు

కొద్దిగా పెరిగిన ఎగుమతులు

న్యూఢిల్లీ: గ్లోబల్​మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ 2023లో మన దేశం నుంచి వస్తువులు  సేవల ఎగుమతులు స్వల్పంగా 0.4 శాతం పెరిగి  765.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కాటన్ నూలు, దుస్తులు, సిరామిక్ ఉత్పత్తులు, మాంసం, పాలు,  పౌల్ట్రీ ఉత్పత్తులు, పండ్లు  కూరగాయలు, ఐటీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి.

అయితే, గత క్యాలెండర్ సంవత్సరంలో వస్తువుల ఎగుమతులు 4.71 శాతం తగ్గి  431.9 బిలియన్ డాలర్లకు చేరుకోగా, సేవల ఎగుమతులు 7.88 శాతం పెరిగి 333.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సరుకుల దిగుమతులు కూడా 2022 సంవత్సరంలో  720.2 బిలియన్ డాలర్ల నుంచి 7 శాతం తగ్గి 667.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశానికి ప్రధాన ఎగుమతి మార్కెట్లు అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, యూకే  జర్మనీ.