ఆక్లాండ్: భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఇరు దేశాల మధ్య వందేళ్ల క్రీడా సంబంధాల వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పర్యటనలో రికార్డు స్థాయిలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఉన్నాయి. న్యూజిలాండ్ క్రీడా చరిత్రలోనే అతిపెద్ద పురుషుల ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం విశేషం.
40 రోజుల పాటు సాగే ఈ పర్యటన అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే మొదటి టీ20తో ప్రారంభమవుతుంది. నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నాయి. 2019–20 సీజన్ తర్వాత భారత్ ఇక్కడ టెస్టు సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. " విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు రానుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఇరు దేశాల సంస్కృతి, స్నేహానికి ఒక వేడుక" అని న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధి గ్లెన్ క్రిచ్లీ తెలిపారు.
భారత న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్
మొదటి టీ20 అక్టోబర్ 22, క్రైస్ట్‌చర్చ్
రెండో టీ20 అక్టోబర్ 24, క్రైస్ట్‌చర్చ్
మూడో టీ20 అక్టోబర్ 27, వెల్లింగ్టన్
నాలుగో టీ20 అక్టోబర్ 30, ఆక్లాండ్
ఐదో టీ20
మొదటి వన్డే నవంబర్ 4, ఆక్లాండ్
రెండో వన్డే నవంబర్ 7, వెల్లింగ్టన్
మూడో వన్డే నవంబర్ 10, హామిల్టన్
నాలుగో వన్డే నవంబర్ 13, మౌంట్ మౌంగనూయి
ఐదో వన్డే
మొదటి టెస్టు నవంబర్ 19-23, వెల్లింగ్టన్
రెండో టెస్టు నవంబర్ 27 - డిసెంబర్ 1, క్రైస్ట్‌చర్చ్
