హైదరాబాద్ కు చేరుకున్న వెయిట్ లిఫ్టర్ మల్లిక

హైదరాబాద్ కు చేరుకున్న వెయిట్ లిఫ్టర్ మల్లిక

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గొల్లపల్లికి చెందిన మల్లిక ఛాంపియన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో తన ప్రతిభ కనబరిచారు. న్యూజిలాండ్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 84 కేజీల విభాగంలో నాలుగు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ మూడవ తేదీ వరకు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లలో పోటీపడి నాలుగు బంగారు పతకాలు సాధించారు.

ఇవాళ ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మల్లికా రాఘవేందర్ గౌడ్ కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు స్థానిక నేతలు శాలువా పూల మొక్కలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్నేహితులు కుటుంబ సభ్యులతో మల్లికా రాఘవేందర్ గౌడ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాణ కర్త బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 

గతంలో కూడా మల్లికా రాఘవేందర్ గౌడ్ ఎన్నో పథకాలను సాధించారు. కోయంబత్తూర్ లో జరిగిన ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలతో పోటీపడి సిల్వర్ పథకాన్ని సాధించి మల్లికా రాఘవేందర్ గౌడ్ తెలంగాణ స్ట్రాంగ్ ఉమెన్ గా పేరు పొందారు.2019 వెస్ట్ బెంగాల్ మొత్తం ఇండియా సీనియర్ తో గోల్డ్ మెడల్ సాధించింది. 2019 ఇన్ దుబాయ్ లో జరిగిన ప్రపంచ గేమ్ లో ఆరో స్థానంలో నిలిచింది, 2021 తమిళనాడులో జరిగిన సినీయార్ బ్రేజోన్ మెడల్ సాధించింది. మరోసారి 2022లో ఏప్రిల్ మాగనూర్ లో సీనియర్ నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించింది. 

ఇప్పటివరకు.. 2015 నుంచి 2022 వరకు ఎన్నో పోటీలో పాల్గొని తెలంగాణలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ గోల్డ్ మెడలిస్ట్ మల్లిక నిలిచారు. మల్లికా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పేరును ప్రపంచ దేశాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని మెడల్స్ సాధించి తెలంగాణ రాష్ట్రానికి శంషాబాద్ కు గొప్ప పేరు తీసుకొస్తానని తెలిపారు.