ఢిల్లీలో మూడు.. కేరళలో ఐదు మంకీపాక్స్ కేసులు

ఢిల్లీలో మూడు.. కేరళలో ఐదు  మంకీపాక్స్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు కలవర పెడుతున్నాయి. కేరళలో కొత్త కేసు నమోదు కాగా, ఢిల్లీలోనూ ఓ ఫారినర్​కు మంకీపాక్స్ వైరస్​ పాజిటివ్​ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలోనే మూడుకు పెరగగా.. కేరళలో ఐదుకు చేరుకున్నాయి. జులై 27న యూఏఈ నుంచి కోజికోడ్​ ఎయిర్​పోర్టుకు వచ్చిన 30 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ కన్ఫామ్ అయిందని కేరళ మంత్రి వీణా జార్జ్ మంగళవారం  వెల్లడించారు.

ఆ యువకుడు మలప్పురంలోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మంకీపాక్స్​తో త్రిస్సూర్​ జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన 22 ఏండ్ల వ్యక్తి కాంటాక్ట్స్ ట్రేస్ చేశామని, 20 మందిని ఐసోలేషన్​లో ఉంచామని చెప్పారు. మరోవైపు, ఢిల్లీలో ఉంటున్న 35 ఏండ్ల ఆఫ్రికన్​కు మంకీపాక్స్ వైరస్​ పాజిటివ్ వచ్చిందని, ఈ మధ్యకాలంలోట్రావెల్ చేయలేదని అధికారులు తెలిపారు.