భారత్ లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం 2023 ఆగస్టు నెలలోనే రూ.1.48 ట్రిలియన్ లావాదేవీలు జరిగాయి. జూలైలో ఇది రూ, 1.45 ట్రిలియన్లు ఉండగా ఆగస్టులో మరింతగా పెరిగింది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో క్రెడిట్ కార్డులు వినియోగించలేదు. ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఒక నెలలో రూ.1.1 నుంచి 1.2 లక్షల కోట్ల మధ్యనే క్రెడిట్ కార్డుల వ్యయం ఉండేది. కానీ అది ఈ సారి ఏకంగా రూ.1.48 ట్రిలియన్లకు చేరుకుంది. దీన్ని బట్టి భారతీయులు ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇక సగటును ఒక్కో క్రెడిట్ కార్డుపై రూ.16,144 ఖర్చు చేస్తున్నారు. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన 18.12 మిలియన్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటానే 28.5 శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్బీఐకి చెందిన 17.13 మిలియన్ల క్రెడిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 14.67 మిలియన్ల క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంకుకు చెందిన 12.46 మిలియన్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి.