ముల్లన్‌పూర్(న్యూ చండీగఢ్): తొలి టీ20 విజయంతో జోరుమీదున్న ఇండియా.. సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే ఈ పోరులో మరోసారి ఆల్‌రౌండ్‌షో చూపెట్టాలని భావిస్తోంది. అయితే శుభ్మన్గిల్ఫామ్పై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 4 రన్స్‌కే ఔటైన గిల్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ఫామ్‌లోకి రావాల్సిందే. ఎందుకంటే టీ20 వరల్డ్‌కప్‌కు కేవలం తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. టెస్ట్‌కెప్టెన్సీ తర్వాత పట్టుబట్టి మరీ గిల్‌ను టీ20 సెటప్‌లోకి తీసుకొచ్చారు. కానీ షార్ట్ఫార్మాట్లో ఇంకా కుదురుకోకపోవడంతో గిల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది.
ఓపెనర్లుగా అభిషేక్‌శర్మ, సంజూ శాంసన్‌రాణించినప్పటికీ.. గిల్‌పై నమ్మకంతో ఓపెనింగ్‌స్లాట్‌కేటాయించారు. దాంతో శాంసన్‌కు తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. ఫైనల్ఎలెవన్లోకి రావడానికి శాంసన్‌ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత టీ20 వరల్డ్ కప్‌ముందు వరకు కోహ్లీ ప్లేస్‌కు సరిగ్గా సరిపోయిన గిల్‌ఇప్పుడు మాత్రం గాడి తప్పడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. పవర్‌ప్లేలో అభిషేక్‌మాదిరి దూకుడుగా ఆడటంలో గిల్‌విఫలమవుతున్నాడు. కెప్టెన్‌సూర్యకుమార్‌యాదవ్‌కూడా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు.
రాబోయే మెగా టోర్నీలో కెప్టెన్‌గా కొనసాగాలంటే సూర్య కచ్చితంగా బ్యాట్‌ఝుళిపించాల్సిందే. తిలక్ వర్మ, అక్షర్‌పటేల్, హార్దిక్‌పాండ్యా మిడిలార్డర్ భారం మోయనున్నారు. గాయం నుంచి తిరిగి వచ్చిన ఆల్‌రౌండర్‌పాండ్యా మునుపటి స్థాయిలో ఆడుతుండటం అదనపు బలంగా మారింది. బ్యాట్, బాల్‌తో స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాడు. శివమ్‌దూబే, జితేష్‌శర్మ ఫినిషింగ్‌పై దృష్టి సారించాలి.
లేదంటే ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఇండియాకు పెద్దగా ఇబ్బందుల్లేవు. ఒకవేళ పిచ్ పొడిగా ఉంటే అర్ష్‌దీప్ ప్లేస్‌లో కుల్దీప్ రావొచ్చు. బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలనుకుంటే హర్షిత్ రాణాను తీసుకొవచ్చు. లేదంటే తొలి మ్యాచ్‌లో ఆడిన బౌలర్లను యధాతథంగా బరిలోకి దించొచ్చు.
బ్యాటింగ్‌పైనే దృష్టి..
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనకబడిన సౌతాఫ్రికా ఎక్కువగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌లో 176 రన్స్ ఛేదనలో 74 రన్స్‌కే ఆలౌట్ కావడం సఫారీలను ఆందోళనలో పడేసింది. కాబట్టి బలమైన బ్యాటింగ్లైనప్ను బరిలోకి దించాలని చూస్తోంది. టీ20ల్లో డికాక్, మార్‌క్రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్‌కు ఎదురులేదు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా భారీ స్కోరును ఆశించొచ్చు.
బలమైన షాట్లతో ఒకటి, రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఆల్‌రౌండర్లుగా యాన్సెన్, ఫెరారియా అంచనాలను అందుకోవాల్సి ఉంది. లుథో సిపామ్లా ప్లేస్‌లో కార్బిన్‌బోష్, జార్జ్‌లిండేలో ఒకరికి చాన్స్‌దక్కొచ్చు. స్పిన్నర్‌కేశవ్‌మహారాజ్, ఎంగిడి, అన్రిచ్‌ప్లేస్‌లు ఖాయం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్క సరిచేయాలని ప్రొటీస్‌లక్ష్యంగా పెట్టుకుంది.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, ట్రిస్టాన్ స్టబ్స్, డేవ్లాడ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవాన్ ఫెరారియా, మార్కో యాన్సెన్, లుథో సిపామ్లా / కార్బిన్ బోష్ / జార్జి లిండే, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, అన్రిచ్.
1టీ20ల్లో వంద సిక్సర్లు, వంద వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా నిలిచేందుకు హార్దిక్‌కు కావాల్సిన వికెట్లు. సికిందర్‌రజా, మహ్మద్‌నబీ, వీరన్‌దీప్ సింగ్ (మలేసియా) ముందున్నారు.
5ఇంటర్నేషనల్‌లో ఉన్న మూడు ఫార్మాట్లలో వంద చొప్పున వికెట్లు తీసిన ఐదో బౌలర్ బుమ్రా. షకీబ్, మలింగ, సౌథీ, షాహిన ఆఫ్రిది ఈ జాబితాలో ఉన్నారు.

