
చెన్సెలో ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న రెండు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 317 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మీద భారత్ గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. అయిదు వికెట్లు తీసి అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ కోలుకోకుండా చేశాడు. అశ్విన్ 3 వికెట్లు, కల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని దక్కించుకుంది. నాలుగు మ్యాచుల సిరీస్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్‌ను గెలిచాయి.
For More News..