
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అతను 71వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగబోతున్న సుమిత్ ఆదివారం పెరుగియా ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. దాంతో గతవారం 77వ ర్యాంక్‌లో నిలిచిన అతను ఆరు స్థానాలు మెరుగు పరుచుకున్నాడు.