ధర్మశాల: టీ20 వరల్డ్ కప్‌కు ఆరు వారాలే టైమ్‌ఉండటంతో.. శుభ్‌మన్‌గిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయ్యింది. దీంతో గత రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఫెయిలైన గిల్‌కు సఫారీలతో జరిగే చివరి మూడు మ్యాచ్‌లు ఫైనల్అడిషన్గా మారాయి. మెగా టోర్నీలో ఆడే జట్టు ఫైనల్‌ఎలెవన్‌లో ఉండాలంటే ఇందులో గిల్ కచ్చితంగా రాణించాలి. లేదంటే ఇండియా ప్లాన్–బికి రెడీ కావాల్సిందే. తాజా పరిణామాలతో ధర్మశాలలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌వాతావరణం మాత్రం బాగా వేడెక్కింది.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇంక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉండటం, కెప్టెన్ సూర్య, గిల్ఫామ్లో లేకపోవడం ఇప్పుడు ఇండియాను ఆందోళనలో పడేశాయి. కాబట్టి వీలైనంత త్వరగా చీఫ్ కోచ్‌గౌతమ్‌గంభీర్‌వీటిని పరిష్కరించాలి. టాప్ఆర్డర్లో ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి సంజూ శాంసన్‌కు చోటు కల్పించాలన్న డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయి. వాస్తవంగా టెస్ట్‌కెప్టెన్‌అయిన గిల్‌ను టీ20 సెటప్‌లోకి తీసుకురావడానికి శాంసన్‌ను పక్కనబెట్టారు.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్, గంభీర్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా దాన్ని సరిదిద్దుకుంటారేమో చూడాలి. మిగతా లైనప్‌లో కూడా కొద్దిగా గందరగోళం కనిపిస్తోంది. రెండో టీ20లో అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో, ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎనిమిదో స్థానంలో దించడం తీవ్రంగా బెడిసికొట్టింది.
కాబట్టి ఈ మ్యాచ్‌లోనైనా ఇలాంటి తప్పుడు ప్రయోగాలు చేయకుండా ఉంటే బెటర్. బౌలింగ్‌లోనూ మార్పులు చేసేందుకు గౌతీ సుముఖత చూపడం లేదు. ప్రొటీస్ బ్యాటర్లను బాగా ఇబ్బందిపెట్టే కుల్దీప్‌కు చాన్స్ ఇవ్వడం లేదు. బుమ్రా, అర్ష్‌దీప్ భారీగా రన్స్ ఇవ్వడం మరో ప్రతికూలాంశం. పాండ్యాతో కలిసి బుమ్రా కొత్త బాల్‌ను పంచుకుంటే తుది జట్టులో కుల్దీప్‌కు చాన్స్ దక్కొచ్చు. వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేయొచ్చు.
అన్రిచ్, కేశవ్‌కు చాన్స్..
రెండో టీ20లో గెలిచి జోరుమీదున్న సౌతాఫ్రికా తుది జట్టులో రెండు మార్పులు చేసే చాన్స్ ఉంది. లుథో సిపామ్లా, జార్జ్ లిండే ప్లేస్‌లో అన్రిచ్, కేశవ్ మహారాజ్‌ను తీసుకురావొచ్చు. మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. హెచ్‌పీసీఏ స్టేడియం పిచ్‌పై అదనపు బౌన్స్ ఉంటుంది.
కాబట్టి అన్రిచ్, యాన్సెన్, ఎంగిడి, బార్ట్‌మన్ కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. బ్యాటింగ్‌లో డికాక్‌ను ఆపకపోతే ఇండియాకు మళ్లీ నష్టం తప్పదు. హెండ్రిక్స్, మార్‌క్రమ్, బ్రేవిస్ గాడిలో పడితే భారీ స్కోరు ఖాయం. మిడిల్‌లో డొనోవాన్ ఫెరీరా, డేవిడ్ మిల్లర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఓవరాల్‌గా కూల్ కండిషన్స్‌లో సఫారీ బ్యాటర్లను కట్టడి చేయాలంటే ఇండియా బౌలర్లు శ్రమించక తప్పదు.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, స్టబ్స్ / హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, జార్జ్ లిండే / కేశవ్ మహారాజ్, ఎంగిడి / కార్బిన్ బోష్, ఒట్నిల్ బార్ట్‌మన్, అన్రిచ్ / సిపామ్లా.
పిచ్, వాతావరణం
ధర్మశాలలో టార్గెట్‌ను కాపాడుకోవడం చాలా కష్టం. గత ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్టే గెలిచింది. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిచ్ పేసర్లకు సహకరించొచ్చు.
1మరో వికెట్ తీస్తే వరుణ్ చక్రవర్తి టీ20ల్లో 50 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో కుల్దీప్, రషీద్ ఖాన్, అజంతా మెండిస్, ఇమ్రాన్ తాహిర్ మాత్రమే వరుణ్ (15.38) కంటే మెరుగైన సగటుతో
50 కంటే ఎక్కువ వికెట్లు తీశారు.
