హైదరాబాద్, వెలుగు: ఇండియా టాప్ జిమ్నాస్ట్, హైదరాబాదీ బుడ్డా అరుణ రెడ్డి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల అరుణ ఈజిప్ట్ కైరోలో మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
మరిన్ని వార్తల కోసం..
ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఎక్కువ
26 వేల బుల్లెట్ బండ్లలో బ్రేక్ సమస్య
దేశంలో బ్యాంకులు ఇప్పుడు సురక్షితం
