
న్యూఢిల్లీ: బ్రేక్స్‌లో లోపాలు ఉన్న 26,300 క్లాసిక్ 350 బైక్స్‌ను వెనక్కి రప్పిస్తామని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. లోపాలను సరిచేసి తిరిగి కస్టమర్లకు ఇస్తామని తెలిపింది. బైక్ స్వింగ్ ఆర్మ్‌కు ఉండే బ్రేక్ రియాక్షన్ బ్రాకెట్ సరిగా లేదని తమ టెక్నికల్ టీమ్ గుర్తించిందని వెల్లడించింది. ఈ పార్ట్‌ను 2021 సింగిల్ చానెల్ ఏబీఎస్, రేర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోటారు సైకిళ్లలో వాడారు. దీనివల్ల కొన్నిసార్లు బ్యాక్ వీల్‌పై ఎక్కువ ఒత్తిడితో బ్రేక్ పడుతోంది. దీనివల్ల రియాక్షన్ బ్రాకెట్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సౌండ్ ఎక్కువగా వస్తుంది. కొన్నిసార్లు బ్రేక్ కెపాసిటీపై ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు ఐదు వరకు తయారు చేసిన మోడల్స్‌లోనే ఈ సమస్యను గుర్తించామని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.