ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఎక్కువ

ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఎక్కువ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మేకల్లో వచ్చే గోట్‌‌‌‌ పాక్స్‌‌‌‌ వ్యాధిని నివారించేందుకు ‘రక్ష గోట్‌‌‌‌ పాక్స్‌‌‌‌’ పేరుతో వ్యాక్సిన్‌‌‌‌ను ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్  లాంచ్ చేసింది. ప్రాంతాలను బట్టి గోట్ పాక్స్‌‌‌‌ను ఈ వ్యాక్సిన్ నివారించడం ఆధారపడి ఉంటుందని తెలిపింది. గోట్ పాక్స్  వచ్చిన మేకల్లో 85 శాతం  వరకు చనిపోతున్నాయని ఈ  సంస్థ పేర్కొంది. దీంతో చిన్న రైతులకు భారీగా నష్టం వస్తోందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 15 కోట్ల మేకలు ఉంటాయని అంచనా. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోట్ పాక్స్‌‌‌‌ ఎక్కువగా విస్తరించి ఉంది. మేకల మూడు నెలల వయసులో ఈ  వ్యాక్సిన్ వేయాలి. 

 

మరిన్ని వార్తల కోసం...

 బండి అమ్మినా చలాన్లు వస్తుంటే.. ఇలా చేయండి

ఓపెనింగ్​కి షేక్ పేట్​, ఒవైసీ ఫ్లై ఓవర్లు రెడీ

మొహాలీలో మెరిసిన తెలంగాణ స్కేటర్లు