ప్రధాని నార్త్ ఈస్ట్ పర్యటన.. మిజోరంలో మొట్టమొదటి రైల్వే లైన్ ప్రారంభించిన మోదీ..

ప్రధాని నార్త్ ఈస్ట్ పర్యటన..  మిజోరంలో మొట్టమొదటి రైల్వే లైన్ ప్రారంభించిన మోదీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 13) మిజోరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హిల్ స్టేట్ అయిన మిజోరంలో మొట్టమొదటి రైల్వే లైన్ ప్రారంభించారు మోదీ. ఇక నుంచి మిజోరం రైల్వే మ్యాప్ లో ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు.

మిజోరంలోని అయిజోల్‌ పర్యటిస్తున్న మోదీ.. బైరబీ-సైరాంగ్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అయిజోల్ అనుసంధానం అవుతున్నట్లుగా ప్రకటించారు. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్‌కతాకు మొత్తం మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు ప్రధాని.

అదే విధంగా  రూ.9వేలకోట్ల అభివృద్ధిపనులకు  శ్రీకారం చుట్టారు మోదీ. అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. నార్త్ ఈస్ట్ స్టార్టప్ హబ్ గా మారుతోందని ఈ సందర్భంగా అన్నారు. 4 వేల 500 స్టార్టప్స్, 25 ఇంక్యుబేటర్స్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.