
హైదరాబాద్, వెలుగు: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్కేటర్లు రెండు గోల్డ్ మెడల్స్‌తో అదరగొట్టారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొహాలీలో జరుగుతున్న ఈ టోర్నీ అండర్ 14–17 కేటగిరీ కపుల్ డ్యాన్స్ టీమ్ ఈవెంట్‌లో జుహిత్–కంతిశ్రీ జంట టాప్ ప్లేస్‌తో గోల్డ్ మెడల్ గెలిచింది. అండర్17 టీమ్ ఈవెంట్లో రాహుల్–ఖ్యాతి జోడీ కూడా బంగారు పతకం సాధించింది. 11–14 టీమ్ ఈవెంట్‌లో ఏపీకి చెందిన లక్షిత్–ఉక్తి సిల్వర్ నెగ్గింది.