బండి అమ్మినా చలాన్లు వస్తుంటే.. ఇలా చేయండి

బండి అమ్మినా చలాన్లు వస్తుంటే.. ఇలా చేయండి
  • వెహికల్​ అమ్మిన తర్వాత  ఆర్​సీ ట్రాన్స్​ఫర్ ​చేసుకోవట్లే  
  • ఏజెంట్లు అమ్మితే సెకండ్​ఓనర్లు పట్టించుకోవట్లే 
  • అమ్మిన బండి ఓనర్లకు ట్రాఫిక్​ చలాన్ల ఇబ్బందులు 

 

 “ కూకట్​పల్లికి చెందిన ఐటీ ఎంప్లాయ్ రాజారాం ఐదేండ్ల కిందట ఏజెంట్​ద్వారా బైక్ అమ్మిండు. ఆ బైక్​ను ఏజెంట్​ఎవరికి అమ్మిండో తెలియదు. ఆర్​సీ ట్రాన్స్​ఫర్​చేయాలని రాజారాం ఎంత చెప్పినా ఏజెంట్​పట్టించుకోలేదు. దీంతో ఆ బండి కొన్న వ్యక్తికి రావాల్సిన చలాన్లు రాజారాం పేరుపైనే వస్తున్నాయని ఆందోళన చెందుతుండు.’’ 

హైదరాబాద్, వెలుగు: సిటీలో సెకండ్​హ్యాండ్​ వెహికల్స్​ అమ్మకాల్లో ఏజెంట్ల మోసంతో ఓనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం కాంతారెడ్డి, రాజారాంల పరిస్థితే కాదని,  బైక్​అమ్మిన ఓనర్లందరి పరిస్థితి ఇట్లనే ఉంది. ఏజెంట్ల ద్వారా వెహికల్ కొన్నవాళ్లు ఎలాంటి ట్రాఫిక్​ రూల్స్​బ్రేక్​చేసినా ఆ చలాన్లన్నీ ఆర్​సీ ఓనర్​పేరు మీదనే వెళ్తున్నాయి. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కార్లను సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్​లో కొనుగోలు చేసేందుకు థర్డ్ పార్టీ ఏజెంట్లు యాక్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటున్నారు. ప్రభుత్వ పర్మిషన్లు పొందిన ఏజెన్సీలు కాకుండా ఫైనాన్సియర్లు కూడా ఏజెంట్లతో కలిసి బైక్​లను కొంటున్నారు.   బైక్ షోరూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఉంటుండగా దగ్గరికి వచ్చిన వారికి వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి రేట్ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కొంటారు. ఈ క్రమంలోనే వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఉన్న ట్రాఫిక్ ఫైన్లను కూడా వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చాలాన్ల పేరిట సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. 

రూల్స్ బ్రేక్ చేస్తుండగా..
సెకండ్​ హ్యాండ్​లో బండి కొంటే, ఆర్టీఐ రూల్స్​ప్రకారం వెంటనే ఆర్​సీని ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలి. కానీ అలా చేయకుండా ఏజెంట్లు వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు. బైక్ తమ పేరు మీద లేకపోవడంతో సెకండ్ హ్యాండ్​బండ్లను వాడుతున్న చాలామంది ట్రాఫిక్​ రూల్స్​బ్రేక్​ చేయడానికి వెనుకాడటం లేదు.  సీసీ కెమెరాలు, పోలీసులు ఫొటోలు తీస్తున్నా  లైట్ తీసుకుంటున్నారు. దీంతో అసలైన ఓనర్లకు ట్రాఫిక్​ చలాన్లు  చిక్కులు వచ్చి పడుతున్నాయి. 

కంప్లయింట్ చేయొచ్చు
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు ట్రాఫిక్ పోలీసులకు కంప్లయింట్​ చేయొచ్చు. ఈ చలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి, ‘complaint’   అనే ఆప్షన్ క్లిక్ చేసి  బైక్ వివరాలు, మెయిల్, కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్​తో సబ్మిట్​ చేయాలి.  కంప్లయింట్​లో ఉన్న బైక్​ వివరాలను హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పెట్టి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్ కాప్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు.  ఆ వెహికల్స్​చెకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టుబడే వాటిని సీజ్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత కంప్లయింట్​చేసిన బండి ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సమాచారం అందిస్తారు. ఇలాంటి కంప్లయింట్లు ఇప్పటివరకు సిటీలో 482 ఉన్నట్టు పోలీసులు తెలిపారు.