సరదాగా ఈతకు వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

సరదాగా ఈతకు వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు పొంగి దూకుతున్నాయి. అయితే జలపాతాలను చూసేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు గల్లంతవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బుధవారం (జులై 23) ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థి గల్లంతవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 

భారీ వర్షాలకు ఆదిలాబాద్  జిల్లా ఖండాల జలపాతం నిండుగా దూకుతుండటం పర్యాటకులను ఆకర్శిస్తోంది. అయితే జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన వారిలో మనోహర్ సింగ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు.  స్నేహితులతో కలిసి అప్పటి దాకా సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థి.. గల్లంతవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.

►ALSO READ | వైరల్ వీడియో: కన్న కూతురిపై తండ్రి శాడిజం.. కాళ్లతో తంతూ పైశాచికం

ఆదిలాబాద్  జిల్లా మొలలు  గుట్టలోని  ఖండాల జలపాతం లో  కొందరు విద్యార్థులు స్నానాలు చేస్తూ ఈత కొడుతూ సరదాగా గడిపారు. ఫోన్ లో వీడియో తీసుకుంటూ అప్పటిదాకా ఎంజాయ్ చేసిన విద్యార్థుల్లో మనోహర్ సింగ్ గల్లంతవ్వడం కుటుంబం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుటుంబ సభ్యుల సమాచారంతో  సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత ప్రయత్నించిన విద్యార్థి ఆచూకీ దరకక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకును ఎలాగైనా తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. మనోహర్ సింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి.