రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడదాం : బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ స్వాతి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడదాం :   బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ స్వాతి
  •     బెల్లంపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​ స్వాతి
  •     ప్రమాణం చేసిన 14 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

బెల్లంపల్లి, వెలుగు: రాజకీయాలకు అతీతంగా బెల్లంపల్లి పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని మున్సిపల్​ చైర్​పర్సన్ ​దావ స్వాతి అన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో 14 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా చైర్​పర్సన్​ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, సుందరంగా తీర్చిదిద్దడానికి అందరు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. 

రాగద్వేశాలకు పోకుండా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లను మున్సిపల్​ చైర్ పర్సన్ ​పలకరించి అభినందనలు తెలిపారు. మున్సిపల్​ కమిషనర్ సంపత్​రెడ్డి, వైస్​ చైర్​పర్సన్​ రాగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.